ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి
వరంగల్ ప్రతినిధి :తెలంగాణ కెరటం నవంబర్ 21తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ట్రాన్స్‌జెండర్ పుష్ప డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్ప మాట్లాడుతూ.. సమాజంలో ట్రాన్స్జెండర్లు అనేక వివక్షలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి గౌరవప్రదమైన జీవనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు నెలకు రూ.10 వేల పింఛన్ అందించాలని, ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు...