పోతారంలో ఘనంగా ముదిరాజ్ జెండా ఆవిష్కరణ
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, ముదిరాజ్ మహాసభ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా పరిధిలోని పోతారంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మత్స్యకారుల ఐక్యత, ముదిరాజ్ సమాజ అభివృద్ధి, హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.