ప్రతి అర్హత కుటుంబానికి జీవిత బీమా పథకం.... జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో  రాం వేణురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత గల ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని అమరవాదిలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా పూరించాలని తెలిపారు....