హ్యాపీ’ స్కూల్ విద్యార్థుల పోలీస్ స్టేషన్ సందర్శన
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల పట్టణంలోని హ్యాపీ స్కూల్ లో "సమాజ సేవకులు" అనే పాఠ్యాంశంలో భాగంగా చిన్నారులు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులు పోలీసులతో మాట్లాడి, వారి విధుల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేసే పనులను, ఆపదలో ఉన్న వారికి వారు ఎలా సహాయం అందిస్తారో, పోలీసు సిబ్బంది పిల్లలకు సరళంగా వివరించారు. చిన్నారుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ప్రజల భద్రత కోసం 24/7 పనిచేస్తూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న పోలీసులకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో గ్రీటింగ్ కార్డులు అందించి,...