ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఉనికిని చాటుకునేందుకే మేకపోతు గాంభీర్యం బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం.. ఉనికిని చాటుకునేందుకే మేకపోతు గాంభీర్యం బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : తెలంగాణలో బిజెపికి రాజకీయ ఉనికి లేదని, ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడున్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు గెలవరని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశ దింపుడు కళ్ళంలాగా ఉందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడి...