ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ మద్దూరి నవ్య నాగరాజు గౌడ్ తెలంగాణ కెరటం  మనోహరాబాద్: మండలంలోని కాళ్ళకల్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు గ్రామ సర్పంచ్ మద్దూరి నవ్య నాగరాజు గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ కార్డులో నమోదై ఉండి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.ప్రతి రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే జీవిత బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు.దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు (ఆహార భద్రత కార్డు), మొబైల్ నంబర్‌తో పాటు నామినీ...