సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన జువ్వాడి నర్సింగరావు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కోరుట్ల పట్టణానికి చెందిన 80 మంది లబ్ధిదారులు, కోరుట్ల మండల పరిధిలోని 127 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి...