విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన భారత్ సురక్ష సమితి నాయకులు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : అమెరికాలోని కొలంబియా, చికాగో విశ్వవిద్యాలయాల్లో భారత ఎన్నికల వ్యవస్థ, ఆర్థిక ప్రగతిపై రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు విమర్శించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు, నాయకులు చిట్ల గంగాధర్, అక్కినపల్లి కాశీనాథంలు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనదని, సామాన్యుడు సైతం చట్టసభలకు ఎన్నిక అయ్యే అవకాశం ఇక్కడ ఉందని, కానీ రాహుల్ గాంధీ మాత్రం భారత దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై దాడి...