శాతవాహన యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించిన కోరుట్ల రామకృష్ణ విద్యార్థిని

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : శాతవాహన యూనివర్సిటీ డిసెంబర్ నెలలో నిర్వహించబోయే మూడవ స్నాతకోత్సవ వేడుకలలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా ప్రధానం చేయబోయే గోల్డ్ మెడల్ కు పీజీ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ లో అత్యధిక మార్కులు సాధించిన రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని పల్లికొండ పావని గోల్డ్ మెడల్ కు ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్ గాడిపెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపక బృందం పల్లికొండ పావనిని అభినందించారు.