గంజాయి మూట గుట్టురట్టు.11 మంది అరెస్ట్.డి.ఎస్.పి పల్లె శ్రీనివాస్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులతో పాటు గంజాయి ని సేవిస్తున్న 9 మంది యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డి.ఎస్.పి పల్లె శ్రీనివాస్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఒడిస్సా నుంచి అచ్చంపేటకు గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం ఈగల్ టీం అచ్చంపేట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని, ఈ దాడుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.