ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అచ్చంపేటలో సభా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అచ్చంపేటనియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకుప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభా ప్రాంగణాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో...