అంగరంగ వైభవంగా వెంకటాపూర్ శ్రీ వేంకటేశ్వరస్వామి జాతర

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కోరుట్ల మండలం వెంకటాపూర్ శ్రీ వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు వెంకటరమణ వైదిక నిర్వహణలో ఉదయం అభిషేకం, విశేష అలంకరణ, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ అలువేలు మంగ, లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు, ధ్మపురి దేవస్థానం మాజీ ఛైర్మన్ జువ్వాడి కృష్ణారావు, బిజెపి...