రాజ్యాంగ హక్కులను అందిపుచ్చుకుంటేనే మహిళా సాధికారత సాధ్యం!
మహిళల హక్కులు, సమాన అవకాశాలపై చర్చకు సిద్ధం.. 26న ‘మహిళలు – రాజ్యాంగం’ సదస్సు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఎల్బీనగర్ హైదరాబాద్, నవంబర్ 21:మహిళా సాధికారత సాధించాలంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలను మహిళలు సంపూర్ణంగా అందిపుచ్చుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న నిర్వహించనున్న ‘మహిళలు – రాజ్యాంగం’ సదస్సు పోస్టర్‌ను శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులతో కలిసి...