రేవంత్ రెడ్డి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువ
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 21, నవంబర్ తిట్ల దండకంతో కాంగ్రెస్ పతనానికి పునాదులు.. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నంసీఎం సభపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, తీవ్ర విమర్శలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు కాంగ్రెస్ పార్టీ పతనానికి సంకేతంగా మారుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో సౌండ్ ఎక్కువ.. సొల్యూషన్ తక్కువగా ఉందని, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తుపాకీ రాముడి కంటే ఎక్కువగా, పిట్టల దొర కంటే తక్కువ కాకుండా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించారు.సిద్దిపేటలో ముఖ్యమంత్రి...