అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి.
అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలి.అచ్చంపేటలో నమోదు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా నమోదు ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పథకం నమోదు సందర్భంగా లబ్ధిదారుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సక్రమంగా సేకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.శనివారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని 4, 5వ వార్డుల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ...