వరిగడ్డి కాల్చవద్దు నేల సారాన్ని కాపాడండి

కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 21 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వరి పంట కోత అనంతరం రైతులు పొలాల్లో మిగిలిన పంట అవశేషాలు (వరి గడ్డి) కాల్చవద్దని ఏడీఏ పుణ్యవతి సూచించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడంతో పాటు భూమి సారం తగ్గిపోతుందని, పర్యావరణం కలుషితమవుతుందని ఆమె తెలిపారు.పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నడం లేదా కంపోస్టుగా తయారుచేసి సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఇలా చేయడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. అంతేకాకుండా పంట అవశేషాలను పశువుల మేతగా, ఇతర వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.పంట అవశేషాలను కాల్చడం వల్ల...