మచిలీ బజార్‌లో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం!

ముదిరాజ్  బి సి -డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి  పులి రజనీకాంత్ డిమాండ్వరంగల్ ప్రతినిధి:తెలంగాణ కెరటం నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మచిలీ బజార్ ముదిరాజ్ కమిటీ హాల్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులందరూ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చినట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ అర్బన్ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ తెలిపారు.ముదిరాజ్ పెద్దమనుషుల సమక్షంలో ముదిరాజ్ జెండాను ఆవిష్కరించి, మత్స్యకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముదిరాజుల ఐక్యత, హక్కుల సాధన కోసం మరింత కృషి...