కార్తీక పురాణం
ముఖ్యమైన పాయింట్స్:11 వ. అధ్యాయంమంథరుడు - పురాణ మహిమ ఓ జనక మహారాజా ! యీ కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును.విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా , చేయించినా , వినినా , వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకింపుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో...