అంబులెన్సులోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి కొండాపూర్ వద్ద అంబులెన్సును నిలిపి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం

 అంబులెన్సులోనే ప్రసవం.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లికొండాపూర్ వద్ద అంబులెన్సును నిలిపి సురక్షిత ప్రసవం చేసిన సిబ్బంది.. తల్లీబిడ్డ క్షేమం  అత్యవసర సమయంలో అంబులెన్సు సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేయించారు. మార్గమధ్యంలోనే అంబులెన్సులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన మామడ మండలంలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన అమీనా బేగం (30), భర్త సహీద్‌కు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అంబులెన్సు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోని కొండాపూర్ వద్ద నొప్పులు తీవ్రం కావడంతో వాహనాన్ని నిలిపివేశారు.అంబులెన్సులో విధులు నిర్వహిస్తున్న అత్యవసర వైద్య సహాయకుడు సురేష్,...