డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం!

దోమల నివారణే డెంగ్యూకు ప్రధాన రక్షణ.. పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధికి అడ్డుకట్ట వర్షాకాలం, వర్షాలు తగ్గిన తర్వాత కూడా దోమల బెడద పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలో ఈ దోమలు వృద్ధి చెందుతాయి. డెంగ్యూ సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వ్యాధి తీవ్రత పెరిగి రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడం, రక్తస్రావం, రక్తపోటు పడిపోవడం వంటి ప్రమాదకర...