మీ గ్రామానికి వచ్చే నిధులు.. ఖర్చుల వివరాలు ఇక మీ అరచేతిలోనే!

మేరీ పంచాయతీ యాప్‌తో గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయ వివరాలు తెలుసుకునే అవకాశం.. ప్రతి పౌరుడు యాప్‌ను వినియోగించుకోవాలి** గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, వివిధ పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, గ్రామ అభివృద్ధి పనులకు చేస్తున్న ఖర్చుల వివరాలను ప్రజలు ఇక సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ‘మేరీ పంచాయతీ’ యాప్ ద్వారా తమ గ్రామానికి సంబంధించిన నిధుల కేటాయింపులు, ఖర్చులు, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మొబైల్ ఫోన్‌లోనే పరిశీలించవచ్చు. గ్రామ పంచాయతీల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ నిధుల వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం. గ్రామానికి ఎంత నిధులు వచ్చాయి? ఏయే...