నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన -దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 22,(తెలంగాణ కెరటం) హైదరాబాద్‌లోని కీసర ఆద్య కన్వెన్షన్ హాల్‌లో జరిగిన సౌమ్య రెడ్డి – రంజిత్ రెడ్డి దంపతుల వివాహ వేడుకకు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా తాండ్ర విజయపాల్ రెడ్డితో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు.