చిన్న ముత్యంపేటలో ఉచిత వైద్య శిబిరం -70 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

దుబ్బాక ప్రతినిధి,తొగుట, నవంబర్ 22:(తెలంగాణ కెరటం )సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో తొగుట మండలం చిన్న ముత్యంపేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 70 మందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.వివిధ వైద్య విభాగాలకు చెందిన వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్"అరవింద్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా వరుసగా ముత్యంపేట గ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే...