వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి.

వెలుగుల ఉదయం చూడాలి...మంజుల పత్తిపాటి.వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టకరేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...ఇసుక గూళ్లు కట్టుకున్నే వయసులోఇటుకల తట్టలు ఇంకా ఎన్ని రోజులు మోయలని..?వెలుగుల ఉదయాన్ని చూడాలని నిద్ర పట్టకరేయిలో జారిన సిరాచుక్క చెప్తోంది...ఆకలి పేగులు మెలిపెడుతుంటేకనుపాపలకు కునుకు ఎలా వస్తుంది అని..?కరెంటు కోతలతో వేడెక్కిన స్టాటరులతో మోటార్లు చనిపోతుంటే...నీళ్లు లేక పొలాలు ఎండిపోతుంటే...రైతన్నల చిరునవ్వుల హారాలు తెగిపోయికుటుంబాలకు దూరం అవుతున్నారు అని రేయిలో జారిన సిరాచుక్క ఆవేదన చెందుతోంది..!రంగుల ప్రపంచంలో ప్లాస్టిక్ జీవితం ఎప్పుడు అంతం అవుతుంది అని నా కలం ఆడుగుతోంది..!గాలికి కొట్టుకుపోయే బతుకులకువరదల జల్లు కాదు..కన్నీటిని తుడిచే చినుకులు కావాలనినా కలం కోరుకుంటోంది..!స్టేటస్‌ల సముద్రంలో మునిగిపోయిన మనసులకుఆప్యాయతల అలలు తాకాలనినా కలం కోరుకుంటోంది..!రచన: మంజుల...