ఘట్కేసర్లో తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు - 52 మంది బాలబాలికల ప్రతిభకు గుర్తింపు.. బెల్టులు, ధ్రువపత్రాల ప్రదానం
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి / నవంబర్ 22: ఘట్కేసర్లోని సెయింట్ ఆంథోనీ హైస్కూల్లో ఆదివారం రియాన్ తైక్వాండో క్లబ్, అచీవర్ తైక్వాండో క్లబ్ సంయుక్తంగా బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్, కొండాపూర్, ఎన్ఎఫ్సీ నగర్, అవుషాపూర్ ప్రాంతాలకు చెందిన 52 మంది బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు డి. సుధీర్, డి. పృథ్వి బెల్టులు, ధ్రువపత్రాలు అందజేశారు. తైక్వాండో సాధనతో శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని, ఒలింపిక్ క్రీడ అయిన తైక్వాండోలో రాణిస్తే ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా కోటా ద్వారా అవకాశాలు...