అలుగునూరు దీక్షా దివస్ సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కీలక ఘట్టం.. ధర్మపురి నియోజకవర్గం నుంచి భారీగా తరలిరావాలి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం తెలంగాణ కెరటం ప్రతినిధి: మేడిపెల్లి గంగాధర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన ఘట్టంగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష స్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 29వ తేదీన కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న 'దీక్షా దివస్' భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ మేరకు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో ఆయన ప్రత్యేక...