వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావుకు సన్మానం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా జువ్వాడి నర్సింగరావును సీనియర్ పాత్రికేయులు, తుమ్మనపెల్లి రాజేంద్రప్రసాద్, మెట్ పల్లి మాజీ ఏంపిపి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోగిటి అంజయ్యలు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజాసేవకు అంకితమైన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు చేసిన సేవలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలు సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు రాష్ట్ర...