నీట్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్ధులను సన్మానించిన డిజిఎం భగవాన్ రెడ్డి, కోర్ డీన్ కె. శ్రీనివాస్

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)ఎస్ఆర్ విద్యాసంస్థల నాణ్యమైన కోచింగ్‌తో పాటు సీనియర్ అధ్యాపకుల వివరణాత్మక బోధనతోనే నీట్ లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ఈ సంవత్సరం ఎస్ ఆర్ కళాశాల నుంచి 705మార్కులతో వీరయ్య సహయు జాతీయ స్ధాయిలో 9 వ ర్యాంకు, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంకుసాధించినందుకు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ వరదా రెడ్డి సంతోషాన్ని వ్యక్తపరిచారు.హైదరాబాద్, మాదాపూర్ ఎస్ఆర్ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2024-26 విద్యాసంవత్సరంలో హైదరాబాద్ ఎస్ఆర్ కళాశాల విభాగంలో రెగ్యులర్ ఇంటర్‌తో పాటుగా నీట్ (NEET) కోచింగ్ తీసుకున్న విద్యార్థుల్లో 72 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వీరిని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్స్ మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సిఈఓ సురేందర్...