శ్రీరాం నగర్ - ఏ కమిటీ హాల్ నందు చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన 279 వ డివిజన్ అధ్యక్షుడు నేమూరి నరేష్ గౌడ్

రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గంశ్రీరాం నగర్ - ఏ కమిటీ హాల్ నందు ఈరోజు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 279 డివిజన్ బీజేపీ అధ్యక్షులు నేమూరి నరేష్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. భారత్ ను పోలియో రహిత దేశంగా నిలుపుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బస్తీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.279 డివిజన్అధ్యక్షులు,నేమూరి నరేష్ గౌడ్