శాస్త్రోక్తంగా మందిరంలో గణపతి,నవగ్రహ,సాయి గాయత్రి హోమం.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22):భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతోత్సవాల జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సత్యసాయి మందిరంలో తెల్లవారుజామున సామూహిక అభిషేకాలు అర్చనలు,నగర సంకీర్తన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందిరంలో ప్రముఖ వేద పండితులు జ్యోషి పాండురంగ శర్మ,ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గణపతి,సాయి గాయత్రీ,నవగ్రహ హోమాలను నిర్వహించినట్లు సాయి మందిరం ప్రధాన అర్చకులు వావిలాల రాజశేఖర్ శర్మ తెలిపారు.సత్యసాయి సేవా సమితి,సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆధ్యాత్మిక,సామాజిక,విజ్ఞాన, సేవా కార్యక్రమాలు నిర్వహించుటలో ఎలాంటి విఘ్నాలు ఉండరాదని గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారని, సాయి భక్తులకు జన్మరత్యా...