21,వ వార్డులో నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : కోరుట్ల పట్టణంలోని 21,వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకంలో భాగంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ఆదివారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, 21,వ వార్డు కౌన్సిలర్ షాహనాజ్ సుల్తానా రిజ్వాన్, జగిత్యాల డిస్టిక్ మైనార్టీ అధ్యక్షులు యంఏ నయీంలు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర...