బిజెపి మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన సురభి నవీన్
బిజెపి మండల అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన సురభి నవీన్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : కథలాపూర్ మండల బిజెపి అధ్యక్షులు మల్యాల మారుతి గౌడ్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించడంతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ఆదివారం వారిని ఆత్మీయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలిపి, చిన్నారిని దీవించారు. సురభి నవీన్ వెంట బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపెల్లి గోపాల్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, బిజెపి కౌన్సిలర్లు, బిజెపి, బిజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.