రాయపట్నం గ్రామంలో బస్టాండ్ లేక ప్రయాణికుల అవస్థలు!

మూడు జిల్లాలకు వెళ్లే ప్రధాన కూడలి.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్డుపైనే గంటల తరబడి వేచి చూస్తున్న ప్రజలు.. ఇప్పటికైనా బస్టాండ్ నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్*జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలోని బస్టేజీ వద్ద బస్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల ఇలా మూడు జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు రాయపట్నం బస్టేజీ ప్రధాన కూడలిగా ఉన్నప్పటికీ, ఇక్కడ కనీసం బస్టాండ్ సౌకర్యం లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఎండ, వాన, చలిలో రోడ్డుపక్కనే నిలబడి.. బస్సుల కోసం...