నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి.

నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ ర్యాలీ విజయవంతం చేయాలి.ఏ. శంకర్ మాదిగ.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22):భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు బీజేపీ దళిత మోర్చా నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. శంకర్ మాదిగ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.బీజేపీ దళిత మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు భారీ రాజ్యాంగ పుస్తకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని...