ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.
మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాట్లకు శంకుస్థాపన.మద్దిమడుగులో 5 వేల మంది గిరిజనులతో ప్రత్యేక సభ.అచ్చంపేటలో లక్ష మందితో భారీ బహిరంగ సభ.ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22):నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న మద్దిమడుగు గ్రామంలో ఈనెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, అచ్చంపేట...