బుజరంపేటలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు ప్రారంభం

అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలికౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 22 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో శ్రీనివాస్, ఎమ్మార్వో కృష్ణ, ఏపీవో పుణ్యదాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుందని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రజలకు...