పేద కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా భరోసా
పీర్యా తండాలో నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ రవళిక రమేష్ కౌడిపల్లి తెలంగాణ కెరటం నవంబర్ 22 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పీర్యా తండా గ్రామపంచాయతీలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నేనావత్ రవళిక రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఎంతో ఉపయోగకరమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీవిత బీమా ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు కుటుంబ భద్రతకు తోడ్పడుతుందని తెలిపారు.గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకం వివరాలను తెలుసుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని...