వృద్ధులకు అండగా రాయపట్నం రామాలయం చెర్మన్
తెలంగాణ కెరటం నవోంబర్ 22 ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి :చలికాలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్న యువకుడు ధర్మపురి,వెల్గటూర్, చలికాలంలో చలితో ఇబ్బందులు పడుతున్న నిరుపేద వృద్ధులకు అండగా నిలిచి రాయపట్నం గ్రామానికి చెందిన గోపతి చేరణ్ తన సేవా గుణాన్ని చాటుకున్నాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి, వెల్గటూర్ ప్రాంతాల్లోని వృద్ధులను గుర్తించి దాదాపు 15 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.చలికాలం తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వృద్ధులు రాత్రివేళల్లో చలిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన యువకుడు వారికి తన వంతు సహాయం అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధుల వద్దకు వెళ్లి స్వయంగా దుప్పట్లు అందజేసి...