పేదల కళ్ళల్లో ఆనందం... ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం!

పేదల కళ్ళల్లో ఆనందం... ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటి కల సాకారం!భువనగిరిలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవికుమార్భువనగిరి: ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కలతో ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. భువనగిరిలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి...