వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి!
పొనకల్ లో ఇప్పటివరకు ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ అధికారులను సంప్రదించగా ట్యాబ్లో లెవల్-3 రావడం లేదని, ప్రభుత్వ నిబంధనల కారణంగా కొనుగోళ్లు ప్రారంభించలేకపోతున్నామని చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొనకల్, ఆదర్శ్ నగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో సుమారు 2,000 బ్యాగుల వడ్లు తేమ శాతం తగ్గి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వడ్లను సాగు చేసినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పంటను ఎక్కడ విక్రయించాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దొడ్డు వడ్లు సాగు చేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా...