మద్దుట్లను మర్చిపోయిన ప్రభుత్వం_ నెల రోజులుగా కల్లంలోనే రైతులు

మద్దుట్లను మర్చిపోయిన ప్రభుత్వం_ నెల రోజులుగా కల్లంలోనే రైతులు మద్దుట్ల (మల్యాల మండలం, జగిత్యాల) 23 - ప్రతినిధి బి. రఘు:నెల రోజులుగా కల్లంలోనే ధాన్యం: మద్దుట్ల గ్రామంలో రైతులు నెల రోజులుగా రోడ్డున పడ్డారు. కోతలు అయిపోయి నెల అయింది. వడ్లు కల్లంలో మగ్గుతున్నాయి. కానీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంనీ ఇప్పటి వరకు ప్రారంభించలేదు పక్క ఊర్లలో కేంద్రాలు తెరిచిన అధికారులు, మద్దుట్లను ఎందుకు మర్చిపోయారో అర్థం కావడం లేదు. మద్దుట్ల రైతులు రైతులు కారా? వారి ఓట్లు మాత్రమే కావాలా, వారి పంట వద్దా?రైతు నెల రోజులుగా ఇంటికి వెళ్లడం లేదు. పగలు ఎండలో వడ్లు ఆరబెడుతూ, సాయంత్రం టార్పాలిన్లు కప్పుతూ, రాత్రి...