రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు కృష్ణవేణి విద్యార్థులు

ఐదుగురు విద్యార్థులకు సీఐ పర్స రమేష్ అభినందనలు తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాంవేణు. మందమర్రి: పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలుర నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 17న నిర్వహించిన జోనల్ స్థాయి నెట్‌బాల్ పోటీల్లో మంచిర్యాల జిల్లా జట్టు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా జట్లపై విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు ఎస్.కె. షహబాజ్, పిప్రే శివచరణ్, రేకుల సాహెత్, వేముల శశివర్ధన్, నాగుల జాయ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను మందమర్రి...