రైతులు ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
ఏఎంసీ చైర్మెన్ పుండ్ర నారాయణ రెడ్డితెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : కథలాపూర్ మండల కేంద్రంలో, సిరికొండ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కథలాపూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్ లు కోరారు. ఆయా గ్రామాల్లో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఐకేపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని, దళరులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులు పండించిన చివరి ధాన్యపు గింజ వరకు కోనేందుంకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు....