అపరిశుభ్రత గుప్పిట్లో నందిపేట్ ఎస్సీ బాలుర వసతి గృహం
చుట్టూ పిచ్చి మొక్కలు, విషపురుగులుపందుల సంచారంతో విద్యార్థుల బెంబేలుఅధ్వాన్నంగా మారిన హాస్టల్ రహదారితక్షణమే చర్యలు తీసుకోవాలని* *అధికారులకు వినతినిజామాబాద్ జిల్లా తెలంగాణ కెరటంనందిపేట్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల ఎస్సీ బాలుర వసతి గృహం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. హాస్టల్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.హాస్టల్ భవనం చుట్టూ భారీగా పిచ్చి మొక్కలు, తుప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు పందుల సంచారం ఎక్కువగా ఉండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. పిచ్చి మొక్కల కారణంగా తరచూ పాములు, తేళ్లు, ఇతర విషపురుగులు హాస్టల్ ఆవరణలోకి వస్తుండటంతో రాత్రి వేళల్లో విద్యార్థులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు...