సంగంపేట్ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలి
👉డిపో మేనేజర్‌కు NVR ఫౌండేషన్ వినతిపత్రం సోన్ మండలంలోని సంగంపేట్ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ NVR సోషల్ వెల్ఫేర్ అకాడమీ ట్రస్ట్ (NVR ఫౌండేషన్) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ TGSRTC డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. NVR ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, రైతులు, కూలీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు సోన్, నిర్మల్‌కు వెళ్లేందుకు ప్రైవేట్ ఆటోలపై ఆధారపడుతూ అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మహిళలు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ప్రయోజనాలను సైతం పొందలేకపోతున్నారని...