ఎల్లంపేట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు చేతుల మీదుగా ప్రారంభం తెలంగాణ కెరటం కామారెడ్డి, నవంబర్ 23:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లంపేట్ గ్రామంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని వివరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,...