గల్ఫ్ లో మృతి చెందిన గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 23:నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం ఎంతో బాధాకరమని కమ్మర్పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ అన్నారు.గల్ఫ్ దేశాలకు పొట్టకూటి కోసం వెళ్లిన గంగాధర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య అరుణ,కూతురుతో కూడిన నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలవడం మనందరి మానవతా బాధ్యత అని పేర్కొన్నారుఈ నేపథ్యంలో కమ్మర్పల్లి మండల...