కంచె పేరుతో రైతుల కడుపు కొడుతున్న హైడ్రా!

మీరాలం కుంట ఫెన్సింగ్‌ పేరుతో పట్టా భూముల్లోకి చొరబాటు?- సాగు భూముల్లో కంచె వేస్తుండటంపై రైతుల ఆగ్రహం- అభ్యంతరం వ్యక్తం చేస్తే కార్యాలయానికి రావాలంటూ అధికారుల సమాధానం(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి: చెరువులు, కుంటల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా అధికారుల చర్యలు ఇప్పుడు రైతుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడ పరిధిలోని మీరాలం కుంట చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్న క్రమంలో, తమ పట్టా వ్యవసాయ భూముల్లోనూ కంచె వేస్తున్నారని రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా తమ ఆధీనంలో ఉన్న పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రస్తుతం కుంట చుట్టూ కంచె ఏర్పాటు పేరుతో తమ పొలాల్లోకి...