పోచారం డివిజన్‌లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలి
ప్రధాన రహదారులు, కాలనీల్లో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని డీసీకి యువజన కాంగ్రెస్ వినతి(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి/ నవంబర్ 22: పోచారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులు, వివిధ కాలనీలలో మెరుగైన విద్యుత్ వెలుతురు సౌకర్యం కల్పించాలని కోరుతూ పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాపల్లి నుంచి కొర్రెముల వరకు, జోడిమెట్ల నుంచి చౌదరిగూడ మీదుగా ప్రతాప్‌సింగారం వరకు, అలాగే కాచవానిసింగారం వెళ్లే ప్రధాన రహదారులపై వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. వీధి దీపాలకు అవసరమైన విద్యుత్ వైర్లు, కేబుళ్లను కూడా ఏర్పాటు చేసి రహదారులన్నీ రాత్రివేళల్లో వెలుగులతో...