కేసీఆర్ ఆమరణ దీక్ష చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత ఘట్టం

దీక్షా దివస్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపు అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సోమవారం ఇంటింటికీ వెళ్లి మహిళలకు, ప్రజలకు బొట్టు పెట్టి కేసీఆర్ చేపట్టిన దీక్ష ప్రాముఖ్యతను, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ చరిత్రను వివరిస్తూ ప్రజలను నవంబర్...